"నా కోసం పుట్టావు.. లోకం కోసం జీవించావు".. చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ విషెస్!

  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • తన భర్తకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి
  • తన భర్తే తన మార్గదర్శి అని ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తన భర్త పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన భార్య నారా భువనేశ్వరి ఎక్స్ వేదికగా ప్రేమపూర్వకమైన శుభాకాంక్షలు తెలిపారు."నా కోసం ఈ రోజు పుట్టావు. కోట్లాది మంది కోసం జీవించావు. మీలో సగమై.. మీ కృషిలో భాగమై.. నా స్వేచ్ఛా స్వతంత్ర సేవా సాధికార మార్గదర్శి.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీ భూ" అంటూ ప్రేమానురాగాలతో ఆమె పోస్ట్ పెట్టారు. కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.


చంద్రబాబును తన సేవా మార్గదర్శిగా అభివర్ణిస్తూ, ఆయన జీవితం కోట్లాది మంది ప్రజల కోసం అంకితమైందని ఆమె కొనియాడారు. చివర్లో చాలా క్లుప్తంగా "మీ భూ" అని రాయడం... సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Chandrababu Naidu
Nara Bhuvaneswari
Andhra Pradesh
AP CM
TDP
Birthday Wishes
Political News
Telugu Desam Party

More Telugu News